పెళ్లి చేసుకోవాలంటూ పెదనాన్న కూతురిపై దాడి

పెళ్లి చేసుకోవాలంటూ పెదనాన్న కూతురిపై దాడి

హైదరాబాద్ నగర శివారులో దారుణం జరిగింది. ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకోవాలంటూ ఏకంగా పెదనాన్నకూతుర్ని బెదిరించి ఆమె తల్లిపై దాడి చేశారు. శంషాబాద్‌ ధర్మగిరి ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. శంషాబాద్‌ వీకర్‌సెక్షన్‌ కాలనీకి చెందిన రమేష్‌ అలియాస్‌ ఉమేష్‌ సొంత పెదనాన్న కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ మూడు నెలలుగా వేధిస్తున్నాడు. అతను శంషాబాద్‌ దేవాలయానికి వెళ్తున్న తల్లీ కుమార్తెను వెంబడించాడు. కత్తితో దాడికి యత్నించగా.. అడ్డుకున్న యువతి తల్లిని గాయపరిచి పరారయ్యాడు. ప్రేమ్మోన్మాది దాడిలో గాయపడిన యువతి తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేష్‌ కోసం గాలిస్తున్నారు.