ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి

ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దారుణం జరిగింది. తనను ప్రేమించడంలేదని ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. కత్తితో దాడికి పాల్పడ్డాడు. పోలీసులు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో దిలీప్ అనే యువకుడు, బాధితురాలు పనిచేస్తున్నారు. ఉదయం దుకాణంలో అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి తెగబడ్డాడు. పక్కనున్న వారు ఆపడానికి ప్రయత్నించిన దిలీప్ దాడికి దిగాడు. ఆ యువతి తనను ప్రేమించలేదనే కారణంతోనే అతను ఈ దాడికి దిగినట్లు తెలుస్తుంది. తీవ్రంగా గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.