హైదరాబాద్ లో రెచ్చిపోయిన ప్రేమజంట

హైదరాబాద్ లో రెచ్చిపోయిన ప్రేమజంట

హైదరాబాద్ లో దారుణం జరిగింది. నెక్లెస్ రోడ్డులో ఓ ప్రేమజంట రెచ్చిపోయింది. అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో ముగ్గురు యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రేమ జంట ముగ్గురు యువకులపై దాడికి పాల్పడింది. ఓ యువకునికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు అస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ యువకుని పరిస్థితి విషమంగా ఉంది. బర్త్ డే పార్టీ చేసుకునేందుకు యువకులు నెక్లెస్ రోడ్డుకు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.