రివ్యూ: లవర్స్ డే

రివ్యూ: లవర్స్ డే

న‌టీన‌టులు: ప్రియా ప్రకాశ్‌ వారియర్, నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌ త‌దిత‌రులు

ఫోటోగ్రఫి: శీను సిద్ధార్థ్‌

సంగీతం: షాన్ రెహ‌మాన్‌

నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు 

ఇంటర్నెట్ సంచలన తార ప్రియా వారియర్ హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా లవర్స్ డే.  మలయాళంలో ఒరు ఆధార్ లవ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో లవర్స్ డే గా రిలీజ్ చేశారు.  ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది.  మరి ఈ సినిమా ఎలా ఉన్నదో.. ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. 

కథ

ప్రియా వారియర్, రోషన్, నూరిన్ తదితరులు కాలేజీలో జాయిన్ అవుతారు.  ఒకే కాలేజీ పైగా ఒకే తరగతి గదిలో ఉండే సరికి వీరిమధ్య పరిచయం ఏర్పడుతుంది.  అందరు ఫ్రెండ్స్ అవుతారు.  ప్రియా, రోషన్ తొలి చూపులోనే ప్రేమలో పడతారు.  వారి ప్రేమకు నూరిన్ సహకరిస్తుంది.  అనుకోకుండా వీరి ప్రేమకు సంబంధించిన వీడియోలు కాలేజీ వాట్సాప్ గ్రూప్ లో ప్రత్యక్షం అవుతాయి.  దీంతో ఇద్దరు విడిపోతారు.  వీరిని తిరిగి కలపడానికి వారి కామన్ ఫ్రెండ్ నూరిన్ ఏం చేసింది..? ఇద్దరు కలిశారా లేదా అన్నది మిగతా కథ.  

విశ్లేషణ

ప్రేమ కథలతో కూడిన సినిమాలు గతంలో చాలా వచ్చాయి.  కన్నుకొట్టి ఇంటర్నెట్ లో సంచలనంగా మారిన ప్రియా వారియర్ చేస్తున్న సినిమా కావడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది.  కొత్తగా కాలేజీచేరిన విద్యార్థుల మధ్య స్నేహం ఏర్పడుతుంది.  ఈ స్నేహానికి సంబంధించిన సీన్స్ ను ఒమర్ లుల్లూ బాగా తీశాడు.  స్నేహం ప్రేమగా మారడం.. క్లాస్ లో ఉండగా.. ప్రియా వారియర్.. రోషన్ కు కన్నుకొట్టడం వంటి సీన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  ప్రయా రోషన్ ల మధ్య వచ్చే రొమాంటిక్ కిస్ సన్నివేశం థ్రిల్ ను కలిగిస్తుంది.  స్నేహం, ప్రేమ, ప్రెషర్స్ డే, యాన్యువల్ డే సెలెబ్రేషన్స్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.  సెకండ్ హ్లాఫ్ లో బ్రేకప్ తరువాత ఇద్దరిని కలపడానికి నూరిన్.. రోషన్ లు ప్రేమలో పడినట్టు నటిస్తారు.  ప్రియా వారియర్ కు ఈర్ష్యను కలిగించి ఇద్దరి కలపాలి అన్నది నూరిన్ ప్లాన్.  సినిమాకు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ హైలైట్ గా నిలిచింది.  

నటీనటుల పనితీరు: 

ప్రియా వారియర్ ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి.  మొదటి సినిమాతోనే ప్రియా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నది.  నటన పరంగా ప్రియా బాగా నటించింది.  హీరో రోషన్ కూడా ఆకట్టుకున్నాడు.  మరో హీరోయిన్ నూరిన్ సినిమాకు హైలైట్ సీన్స్ లో మెప్పించింది.  మిగతా నటులు వారి పరిధిమేరకు మెప్పించారు. 

సాంకేతిక వర్గం పనితీరు

దర్శకుడు ఒమర్ లుల్లూ మొదట అనుకున్న కథను మరలా మార్చి కథనాలు అల్లుకోవడంతో కొంత గందరగోళం ఏర్పడింది.  ప్రియా వారియర్ కు వచ్చిన క్రేజ్ ను సినిమాకు వాడుకోవడంలో ఒమర్ కొంతవరకు సఫలం అయ్యారనే చెప్పాలి. ప్రేమ కథలలో ఎమోషన్స్ ఉండాలి.  ఎమోషన్స్ లేకపోతె.. కథ ఎంత బాగున్నా ఆకట్టుకోదు.  ఈ సినిమాలో ఇదే జరిగింది. క్లైమాక్స్ మినహా సినిమాలో పెద్దగా ఏమి లేకపోవడం విశేషం.  సినిమాటోగ్రఫీ బాగుంది.  సంగీతం, పాటలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

నటీనటులు 

సంగీతం 

పాటలు 

మైనస్ పాయింట్స్: 

కథ 

కథనాలు 

చివరిగా: లవర్స్ డే ప్రేమికులకు ప్రత్యేకం