చందానగర్‌లో ప్రేమ జంట ఆత్మహత్య

చందానగర్‌లో ప్రేమ జంట ఆత్మహత్య

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. చందానగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ లాడ్జిలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. యువకుడు మోహన్ నాయక్, యువతి స్వర్ణలతగా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం వీరు ఈ లాడ్జిలో గది తీసుకుని విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మోహన్‌నాయక్‌ది నల్గొండ జిల్లా నారాయణపురం మండలం కొర్రతండా అని, అతను క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తేల్చారు. స్వర్ణలత బీటెక్ చదివిందని.. వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు భావిస్తున్నారు. చందా నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.