ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడు మృతి..

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడు మృతి..

విశాఖలోని పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియుడు అక్కడికక్కడే మృతిచెందగా.. ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ప్రియురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రేమజంట బాదాం మిల్క్‌లో విషం కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రేమజంట పక్కనే రెండు బాదాం మిల్క్ బాటిళ్లను గుర్తించారు పోలీసులు. ప్రేమికులు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఆడారు గ్రామానికి చెందినవారు... మృతుడు సత్యనారాయణగా గుర్తించారు. ప్రేమికులు ఒకే కుటుంబానికి చెందినవారిగా చెబుతున్నారు పోలీసులు. సత్యనారాయణ మృతిచెందగా.. కమల పరిస్థితి విషమంగా ఉంది. ఒక ప్రియురాలి బ్యాగులో సూసైడ్ నోట్‌ లభ్యమైంది. కుటుంబంతో హ్యాపీగా ఉండాలని ఉంది... మాకు అదృష్టం లేదు.. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి.. ఇదే నా చివరి కోరిక అంటూ ప్రియురాలు కమల సూసైడ్ నోట్‌ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.