కరోనా మరణాలకు ఈ మూలకం లోపమే కారణమా?
ప్రపంచంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది. కరోనా మరణాలు అధికంగా సంభవించడానికి గల కారణాలపై పరిశోధకులు పరిశోధన జరిపారు. విటమిన్ సి, విటమిన్ డి లు వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటంతో సమర్ధవంతంగా పనిచేస్తాయి. అయితే, వీటితో పాటుగా శరీరంలో జింక్ మూలకం కూడా అవసరం అని పరిశోధకుల పరిశోధనలో తేలింది. శరీరంలో జింక్ స్థాయి కావాల్సినంత ఉంటె మరణాల రేటు తక్కువగా ఉంటుంది. ఒకవేళ జింక్ స్థాయి తక్కువగా ఉంటె కరోనా మరణాలు రేటు అధికంగా ఉంటుందని బార్సిలోనాలోని టెర్షరీ యూనివర్సిటీ పరిశోధకుల పరిశోధనలో తేలింది. జింక్ సమృద్ధిగా లభించే ఆహార పదార్ధాలు తీసుకోవడం వలన కరోనా మరణాలను తగ్గించవచ్చని నిపుణులు పరిశోధకులు చెప్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)