కోస్తాంధ్ర, రాయలసీమకు వర్ష సూచన..!

కోస్తాంధ్ర, రాయలసీమకు వర్ష సూచన..!

రేపు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.  తూర్పు రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని, అది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ రాగల రెండు రోజుల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందన్నారు. రేపు ఉత్తర బంగాళాఖాతం లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 25 వ తేదీ నుండి వర్షాలు క్రమంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మత్స్య కారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.