ఉత్తర కోస్తాలో కొనసాగుతున్న చలి

ఉత్తర కోస్తాలో కొనసాగుతున్న చలి

రానునన్న 24గంటల్లో ఉత్తర కోస్తాలో చలి తీవ్రత కొనసాగుతుందని, మిగిలిన ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుగాలుల ప్రభావంతో కోస్తాలో మంచు కురుస్తోందని పేర్కొంది. ఒడిషా, ఛత్తీస్ గడ్ లలో నెలకొన్న వాతావరణం ప్రభావంతో ఉత్తర కోస్తాలో చలిగాలులు వీచాయి. తూర్పుగాలులతో మధ్య కోస్తాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగ్గా, ఉత్తర కోస్తాలో మాత్రం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి.