గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పెంపు

గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పెంపు

అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డంతో పాటు రూపాయి బ‌ల‌హీనప‌డ‌టంతో ఎల్‌పీజీ గ్యాస్ (స‌బ్సిడీ లేని) ధ‌ర రూ.59 పెంచారు. ఇది ఢిల్లీలో  రేటు. స‌బ్సిడీతో ఇచ్చే గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర మాత్రం రూ. 2.89 మాత్ర‌మే పెంచారు. ఇది ధ‌ర పెంపు కాద‌ని, జీఎస్టీ కార‌ణంగా పెరిగింద‌ని ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ వెల్ల‌డించింది. కొత్త ధ‌ర‌లు అక్టోబ‌ర్ నెల నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయి. తాజా ధ‌ర‌ల త‌ర‌వాత స‌బ్సిడీ సిలెండ‌ర్ ప్ర‌భుత్వం ఇచ్చే రాయితీ రూ. 376కు చేరుతుంది.ప్ర‌స్తుతం ఇస్తున్న స‌బ్సిడీ రూ. 320.49. ఎల్పీజీ ధ‌ర అంత‌ర్జాతీయ మార్కెట్‌లోపెరిగినా ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తోంద‌ని, వినియోగ‌దారుల‌పై వేయ‌డం లేద‌ని ఐఓసీ తెలిపింది.