బ్రేకింగ్ న్యూస్‌: వినియోగదారులకు కేంద్రం షాక్‌...వంట గ్యాస్ ధరలు భారీగా పెంపు

బ్రేకింగ్ న్యూస్‌: వినియోగదారులకు కేంద్రం షాక్‌...వంట గ్యాస్ ధరలు భారీగా పెంపు

దేశ ప్రజలకు చమురు సంస్ధలు మరోసారి  షాక్ ఇచ్చాయి..వంట గ్యాస్ ధరలను పెంచుతూ గ్యాస్ కంపెనీలు పెంచాయి..ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరల ప్రభావం వల్ల జూన్ 1వ తేదీ నుంచి భారతదేశంలో కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి...ప్రస్తుతం సిలిండర్ ధర రూ.100కి పైగా పెరిగింది..దీంతో గ్యాస్ వినియోగదారులపై ప్రభావం పడనుంది.... సిలిండర్ ధర పెంపును పరిశీలిస్తే.. 14.2 కేజీల నాన్ సబ్సీడీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.11.5 పెరిగింది... దీంతో సిలిండర్ ధర రూ.593కి చేరింది. అలాగే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.110 పెరిగింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1139కి ఎగసింది.
ఈ పెరుగుదలకు ముందు అంతర్జాతీయంగా ఫ్యూయల్ ధరలు తగ్గడంతో...మే నెలలో ప్రపంచ ధరల కారణంగా ధరలను మూడు నెలలు తగ్గించారు..గత నెలలో వంట గ్యాస్ ధర రూ.744 నుంచి రూ.581.50కి తగ్గించారు..జూన్ వచ్చేసరికి అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగాయని,అందువల్ల తామూ పెంచాల్సి వచ్చిందని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి..

ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ పెంపు ఉజ్జ్వాలా యోజన లబ్ధిదారులను వర్తించదని ఇండేన్ గ్యాస్ కంపెనీ తెలిపింది...ఎందుకంటే వారు "ప్రధాన మంత్రి గారిబ్ కళ్యాణ్ యోజన పరిధిలో ఉన్నారు కాబట్టి జూన్ 30 వరకు ఉచిత సిలిండర్‌కు అర్హులు అని ఆయిల్‌ కంపెనీలు తెలిపాయి...