అక్కడ బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్

అక్కడ బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్

రాజమౌళి దృశ్యకావ్యం బాహుబలి 2 ప్రతి భాషలోనూ రికార్డులు సృష్టించింది.  ముఖ్యంగా దక్షిణాది భాషల్లో ఈ సినిమా సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు.  భారీ స్థాయిలో వసూళ్లు సాధించింది.  దక్షిణాదిలో చిన్న రాష్ట్రమైన కేరళలో బాహుబలి 2 ఏడు రోజుల్లో రూ.30 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది.  ఇప్పటి వరకు ఇదే రికార్డ్.  

ఈ రికార్డ్ ను మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ సినిమా బ్రేక్ చేసింది.  మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమా కేవలం ఆరో రోజుల్లోనే రూ.30 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసి కొత్త రికార్డును నెలకొల్పింది.  మలయాళం స్టార్ హీరో పృద్విరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్ లు ముఖ్యపాత్రల్లో నటించారు.  ప్రపంచ వ్యాప్తంగా లూసిఫర్ సినిమా రూ.70 కోట్ల రూపాయలు వసూలు చేసింది.