'ధోనీని ఔట్‌ చేశా.. నేనెంతో అదృష్టవంతుడిని..'

'ధోనీని ఔట్‌ చేశా.. నేనెంతో అదృష్టవంతుడిని..'

వరల్డ్‌కప్‌ మొదటి సెమీఫైనల్స్‌లో టార్గెట్‌కు దగ్గరగా వచ్చి చేతులెత్తేసి ఓడిపోయిన టీమిండియా.. మహేంద్ర సింగ్‌ ధోనీ అవుటవకుండా ఉంటే గెలిచేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. హాఫ్‌ సెంచరీ చేసి ఓ సిక్సర్‌ బాది.. మరిన్ని బౌండరీల కోసం చూసున్న సమయంలో ధోనీని మార్టన్‌ గప్టిల్‌ రనౌట్‌ చేశాడు. 

ధోనీ అవుటవడంతో మ్యాచ్‌ మొత్తం పూర్తిగా న్యూజిలాండ్‌ చేతుల్లోకి వెళ్లింది. ఈ రనౌట్‌పై మార్టిన్‌ గప్టిల్‌ స్పందించాడు. ధోనీ వంటి మ్యాచ్‌ విన్నర్‌ను డైరెక్ట్‌ హిట్‌గా రనౌట్‌ చెయ్యడం తన అదృష్టమని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇవాళ ట్వీట్‌ చేసింది.