ఎన్నికల షెడ్యూల్‌ను ఛాలెంజ్‌ చేస్తూ పిటిషన్‌

ఎన్నికల షెడ్యూల్‌ను ఛాలెంజ్‌ చేస్తూ పిటిషన్‌

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నిలకు సిద్ధం కాగా... తాజాగా కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. అయితే, ఎన్నికల షెడ్యూల్ ను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు కాంగ్రరెస్ సీనియర్ నేత డీకే అరుణ తరుపన న్యాయవాది నిరూప్‌రెడ్డి... కేబినెట్‌ నిర్ణయంతోనే సభను రద్దు చేస్తారా? అని పటిషన్‌లో ప్రశ్నించారు. సభకు సమాచారం ఇవ్వకుండా  9 నెలలు ముందుగానే అసెంబ్లీని రద్దు చేయడం సభ్యుల హక్కులను కాల రాయటమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు.