నేను సమీక్షలు నిర్వహిస్తే తప్పేంటి..?

నేను సమీక్షలు నిర్వహిస్తే తప్పేంటి..?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాఖల సమీక్షలు నిర్వహిస్తే తప్పేంటని ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రధాన కర్యాదర్శిగా ఆయన ఆయా శాఖల వారీగా సమీక్షలు నిర్వహించడంపై ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో సుబ్రహ్మణ్యం స్పందించారు. తాను సమీక్షలు నిర్వహించడంలో తప్పు లేదని స్పష్టం చేశారు. ఇక.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాజకీయ నేతలు నిబంధనలకు అనుగుణంగానే నడుచుకోవాలని అన్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని చెప్పారు.