సినీగేయ రచయిత చంద్రబోస్ కు మాతృవియోగం

సినీగేయ రచయిత చంద్రబోస్ కు మాతృవియోగం

టాలీవుడ్ సినీ గేయరచయిత చంద్రబోస్  మాతృవియోగం కలిగింది.  ఈ ఉదయం చంద్రబోస్ మాతృమూర్తి గుండెపోటుతో హైదరాబాద్ లోని స్వగృహంలో మరణించారు. ఈ సాయంత్రం చిట్యాల మండలంలోని చల్లగిరి గ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం.  

చంద్రబోస్ సినీగేయ రచయితగా టాలీవుడ్ లో మంచిపేరు తెచ్చుకున్నారు.  ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాశారు. 1995లో తాజ్ మహల్ సినిమాతో సినీగేయ రచయితగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాది పాటలు రాశారు.  ఇందులో పెదవే పలికే మాటల్లోని తీయని మాటే అమ్మ.. అనే పాట మరిచిపోలేనిది. ఇలా అమ్మపై ఎన్నో పాటలు రాశారు చంద్రబోస్.