ప్రముఖ గీత రచయిత శివగణేష్ కన్నుమూత..!

ప్రముఖ గీత రచయిత శివగణేష్ కన్నుమూత..!

జీన్స్, ప్రేమికుల రోజు, బాయ్స్, ఒకేఒక్కడు, 7/జీ బృందావన్ కాలనీ, నరసింహా వంటి ఎన్నో చిత్రాలకు పాటలు రాసిన గీత రచయిత శివగణేష్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు.  హైదరాబాద్ లోని వనస్థలిపురంలో అయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.  దాదాపు అయన వెయ్యికిపైగా సినిమాలకు పాటలు రాశారు.  శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలకు అయన రాసిన పాటలు ప్రసిద్ధి చెందాయి.  శివగణేష్ మరణం పట్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ సంతాపాన్ని తెలిపింది.