పట్టాలు తప్పిన మచిలీపట్నం ప్యాసింజర్ ట్రైన్

పట్టాలు తప్పిన మచిలీపట్నం ప్యాసింజర్ ట్రైన్

విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తున్న మచిలీపట్నం ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది. మంగళవారం సాయంత్రం విజయవాడ నుంచి బయల్దేరిన ప్యాసింజర్‌ ట్రైన్ గుడ్లవల్లేరు మండలం వడ్లమానాడు వద్ద గేదెను ఢీకొట్టింది. దీంతో ట్రైన్ చివర్లో ఉన్న నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఆ సమయంలో ట్రైన్ తక్కువ వేగంతో వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ మార్గంలో సింగిల్ రైల్వే లైన్ కావడంతో విజయవాడ - మచిలీపట్నం మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.