సుకుమార్ 'పుష్ప' సినిమాలో ఆ స్టార్ హీరో

సుకుమార్ 'పుష్ప' సినిమాలో ఆ స్టార్ హీరో

టాలీవుడ్ టాలెంట్ డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం సినిమాతో సత్తాచాటిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ లెక్కల మాస్టర్  అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇక బన్నీ ఈ సినిమాలో ఊర మాస్ గా కనిపించనున్నాడు పుష్పక్ నారాయణ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు- తమిళ- కన్నడ- మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో తమిళ్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. కాగా అనుకోని కారణాల వల్ల ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నాడు. అయితే ఈ పాత్రలో ఎవరిని తీసుకోనున్నారన్నది ఆసక్తిగా మారింది . కొంతమంది పేర్లు వినిపించినప్పటికీ క్లారీటి రాలేదు. తాజాగా స్టార్ హీరో మాధవన్ పేరు వినిపిస్తుంది. విజయ్ సేతుపతి ప్లేస్ లో మాధవన్ ను ఎంపిక చేశారట . ఫారెస్ట్ ఆఫీసర్ గా మాధవన్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. అన్ని అనుకున్నట్టు జరిగితే నవంబర్ 20 నుంచి సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన  హీరోయిన్ గా నటిస్తుంది. దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఆర్య - ఆర్య 2 చిత్రాల తరువాత మూడవ సారి బన్నీ ,సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి.