డ్రగ్స్ కలకలం పై మాధవీలత సంచలన వ్యాఖ్యలు..!

డ్రగ్స్ కలకలం పై మాధవీలత సంచలన వ్యాఖ్యలు..!

నటి బీజేపీ నాయకురాలు మాధవీలత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో కలకలం  సృష్టిస్తున్న డ్రగ్స్ కేసుపై ఆమె స్పందించింది. .బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు వెనుక మాఫియా ఉందని, పరిశ్రమలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా స్వరం పెంచడం వల్ల నటి కంగనా రనౌత్ ఎదుర్కొంటున్న పరిణామాలను చూస్తున్నామని మాధవి లత వ్యాఖ్యానించింది.  పార్టీ కల్చర్ దక్షిణ పరిశ్రమ వైపు  నెమ్మదిగావ్యాపిస్తోందని ఆమె అన్నారు. ఇందులో అధికారుల వైఫల్యం కూడా కనిపిస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి  రకుల్ ప్రీత్ సింగ్ సహా బాలీవుడ్ ప్రముఖుల పేర్లను వెల్లడించడం తో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది.