రాహుల్‌ గాంధీని కలిసిన మధు యాష్కీ.. పీసీసీలో ఇలా చేయండి..!

రాహుల్‌ గాంధీని కలిసిన మధు యాష్కీ.. పీసీసీలో ఇలా చేయండి..!

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిసిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్... తెలంగాణరు రావాల్సిందిగా ఆహ్వానించారు... ఢిల్లీలో రాహుల్‌ను కలిసిన ఆయన.. తెలంగాణలో పార్టీ స్థితి గతులపై తన అభిప్రాయాలను తెలియజేశారు.. తెలంగాణలో ఏర్పాటు చేయబోయే కొత్త ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)లో సామాజిక న్యాయం ఉండేలా చూడాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. పీసీసీ, ప్రచార కమిటీ... రెండు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వొద్దని రాహుల్‌ను కోరిన యాష్కీ.. తెలంగాణలో పర్యటన పెట్టుకోవాలని సూచించారు.. అక్కడికి వచ్చి తెలంగాణ నాయకులతో సమావేశం అవ్వాలని కోరారు.. అయితే, ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో... ప్రచారంలో బిజీగా ఉన్న కారణంగా.. ఆ ఎన్నికలు కాగానే తెలంగాణ పర్యటన ఫైనల్ చేస్తానని రాహుల్ గాంధీ చెప్పినట్టుగా తెలిపారు మధుయాష్కీ. కాగా, తెలంగాణలో కొత్త పీసీసీ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసే.. ఇక త్వరలోనే ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోన్న సమయంలో.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు పూర్తి అయిన తర్వాత ప్రకటించాలని సీనియర్ నేత జానారెడ్డి విజ్ఞప్తి చేయడంతో... కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన ఆపిన సంగతి తెలిసిందే.