రెండు కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోడీ నినాదం ఏమైంది ?

రెండు కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోడీ నినాదం ఏమైంది ?

గత ఆరు సంవత్సరాలుగా దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా కంఠక పాలన చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని ఏఐసిసి కార్యదర్శి, మాజి ఎంపీ మధు యాష్కి గౌడ్ విమర్శించారు. దేశంలో నిరుద్యోగ రేటు పెరుగి 27 శాతం కు చేరిందన్న ఆయన రెండు కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోడీ నినాదం ఏమైందని ప్రశ్నించారు. ఉన్న ఉద్యోగాలే పోతున్నాయన్న యాష్కీ మోడీ అనాలోచిత ఆర్దిక నిర్ణయాలతో దేశ వ్యవస్థ అతలాకుతలం అయిందని అన్నారు. మోడీ డిమానిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాలతో ఇప్పుడు కరోనా సందర్భంలో కోట్లాది మంది ప్రజలు బాధలకు గురవుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

యవకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఓ తల్లిగా సోనియా గాంధీ బిడ్డల త్యాగాన్ని గుర్తించి తెలంగాణ ఇచ్చిందని, కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ రాబందులు సమితిగా మారి తెలంగాణను దోచుకుంటందని అన్నారు. తెలంగాణలో రాబందులు సమితి పాలనను పారదోలేందుకు ప్రతిన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందన్న ఆయన 55 శాతం ఉన్న యువత వారి భవిష్యత్తు కోసం ప్రజాకంఠక పాలకులను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.