సీక్వెల్ కు సిద్దమవుతున్న మధూర్ బండార్కర్..!

సీక్వెల్ కు సిద్దమవుతున్న మధూర్ బండార్కర్..!
2001 సెప్టెంబర్ 28 న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనాత్మకమైన సినిమా విడుదలైంది. జాతీయ స్థాయిలో సంచనలనం సృష్టించిన ఆ సినిమా జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది.  అది మరేదో కాదు.. టబు నటించిన చాందిని బార్.  మధూర్ బండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనాన్నిరేపింది.  ముంబైలోని బార్ డాన్సర్ల జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తీశారు.  క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్ళను సాధించింది.  మధూర్ బండార్కర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.  ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకు అందరూ ఈ సినిమాను మెచ్చుకున్నారు.  ఈ సినిమా వచ్చిన నాలుగు సంవత్సరాలకు 2005 లో ముంబై బార్లలో డ్యాన్స్ ను నిషేదించారు.  
 
శైలేష్ ఆర్ సింగ్ నిర్మించిన ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతున్నది.  మధూర్ బండార్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా కథకు సంబంధించిన పరిశోధన జరుగుతున్నది.  2005 లో విధించిన నిషేధం చుట్టూనే సినిమా కథ ఉంటుందని సమాచారం.  కథకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. కథ పూర్తికాగానే దీనికి సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతుందట.