17న కమల్‌నాథ్‌ ప్రమాణస్వీకారం

17న కమల్‌నాథ్‌ ప్రమాణస్వీకారం

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ వీడిపోయింది. కాంగ్రెస్ అధిష్ఠానం సీనియర్‌కే ఓటువేసి... సీనియర్ నేత కమల్‌నాథ్‌నే ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ఇక కమల్‌నాథ్‌  ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతున్నారు. మధ్యప్రదేశ్‌ గవర్నర్ ఆనందబెన్ పటేల్... కమల్‌నాథ్‌ను సీఎంగా అపాయింట్ చేశారు. ఈ నెల 17వ తేదీన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్.