వైరల్: కొడుకు మీద కోపం.. పెంపుడు కుక్కకు ఆస్తి..!
ఆస్తి ఉంటే చాలు.. అందరి మధ్య చిచ్చు పెట్టేస్తోంది.. అన్నదమ్ములు, తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు ఇలా తేడా లేకుండా గొడవలు జరగడం సర్వసాధారణం.. ఆస్తుల కోసం గొడవలు, ఘర్షణలు, పోలీసులు కేసులే కాదు.. సొంతవాళ్లు అని చూడకుండా హత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో వెలుగు చూశాయి.. కొందరు తమ ఆస్తులను ట్రస్టులకు, అనాథ శరణాలయలకు, ఆలయాలకు... సేవా కార్యక్రమాలు చేసేవారికి రాసిచ్చినవారు కూడా ఉన్నారు.. కానీ, ఓ తండ్రి రైతుకు విపరీతమైన కోపం వచ్చింది.. దీంతో.. తనకున్న భూమిలో ఓ రెండు ఎకరాల భూమి తన పెంపుడు కుక్క పేరు మీరు వీలునామా రాసేశాడు.. మధ్య ప్రదేశ్లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
నెట్టింట వైరల్గా మారిన ఆ వీలునామా విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా బరబడకు చెందిన 50 ఏళ్ల ఓం నారాయణ్ వర్మ అనే రైతుకు 21 ఎకరాల పొలం ఉంది.. అయితే, తన కుమారుడితో గొడవ జరిగింది ఆ వ్యక్తికి దీంతో.. తన పెంపుడు కుక్క జాకీ పేరుపై 2 ఎకరాలు, మిగతా భూమి మొత్తం తన భార్య 47 ఏళ్ల చంప పేరు మీద రాసేశాడు. తన కొడుకు మీద కోపంతోనే ఈ పనిచేసినట్టు చెప్పుకొచ్చాడు.. తన భార్య, పెంపుడు కుక్క మాత్రమే తన బాగోగులు చూస్తున్నారని.. అందుకే వారికే తన ఆస్తి వర్తించేలా వీలునామా రాశానని చెప్పుకొచ్చాడు.. తాను చనిపోయిన తర్వాత ఆ కుక్క అనాథగా మారడం ఇష్టం లేకే ఈ పనిచేశానని.. తన తర్వాత ఆ కుక్క బాగోగులు చూసే వారికే ఆ 2 ఎకరాల భూమి చెందుతుందని పేర్కొన్నాడు.. అయితే, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.. కొడుకుపై కోపంతో ఊగిపోయిన ఓం నారాయణ ఆ పనిచేసినా.. తర్వాత ఆ గ్రామ సర్పంచ్ సముదాయించడంతో.. ఆ వీలునామాను వెనక్కి తీసుకున్నాడు. కానీ, ఈ వ్యవహారం కాస్తా వైరల్గా మారింది.. తండ్రికి ఆస్తులున్న కొడుకుల్లారా..! వారికి నచ్చిన విధంగా ఉండకపోతే.. మీ పెంపుడు కుక్కకు కూడా ఇలాంటి అదృష్టం పడుతుందేమో జాగ్రత్త మరి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)