అసెంబ్లీకి కరోనా ఎఫెక్ట్... అందరూ ఇలా... 

అసెంబ్లీకి కరోనా ఎఫెక్ట్... అందరూ ఇలా... 

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాను కూడా ఇబ్బందులు పెడుతున్నది.  ఇప్పటికే దేశంలో 112 మంది వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.  రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి.  దీనిని ఇండియా ప్రభుత్వం నోటిఫైడ్ నేషనల్ డిజాస్టర్ గా ప్రకటించింది.  దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.  

ఇదిలా ఉంటె, ఈరోజు నుంచి మధ్యప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.  ఈరోజున ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడాల్సి ఉన్నది.  అయితే, ఈరోజునే బలపరిక్ష నిర్వహించాలని గవర్నర్ పేర్కొన్నారు.  బలపరీక్ష తరువాతే సభ జరగాలని గవర్నర్ ఆదేశించారు.  అయితే, స్పీకర్ మాత్రం ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకులేదు.  ఎప్పుడు బలపరీక్ష ఏర్పాటు చేసినా తాము గెలిచి తీరుతామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ చెప్తున్నారు.  కమల్ నాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నా ఎందుకని స్పీకర్ అనుమతి ఇవ్వడంలేదు తెలియడం లేదు.  ఇకపోతే, కరోనా భయం ఆ రాష్ట్ర అసెంబ్లీని కూడా తాకింది.  మధ్యప్రదేశ్ లోని ఎమ్మెల్యేలు ముఖానికి మాస్క్ లు ధరించి సభకు హాజరయ్యారు.  సభలో ఎక్కడ చూసినా మాస్క్ లు కట్టుకున్న వ్యక్తులు కనిపిస్తున్నారు.