కిరణ్ బేడీకి షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్

కిరణ్ బేడీకి షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్

సీఎం, ఎల్జీ వివాదం కేసులో మద్రాస్ హైకోర్ట్ పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి పెద్ద షాకిచ్చింది. ఏఎన్ఐ వార్తాసంస్థ కథనం ప్రకారం ఒక కేసు విచారణ సందర్భంగా కోర్టు, కేంద్రపాలిత రాష్ట్ర రోజువారీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకొనే హక్కు కిరణ్ బేడీకి లేదని స్పష్టం చేసింది. గత కొన్నాళ్లుగా పుదుచ్చేరీ ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీల మధ్య రాజకీయ యుద్ధం సాగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాదిరిగానే పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ తన దగ్గరకు ఫైళ్లు పంపడం లేదని ఆరోపించారు.