ఆన్ లైన్ మెడిసిన్ అమ్ముకోవచ్చు

ఆన్ లైన్ మెడిసిన్ అమ్ముకోవచ్చు

ఆన్ లైన్ లో మెడిసిన్ విక్రయాల నిషేదంపై మద్రాస్ హైకోర్టు ద్విసభ్య బెంచ్ స్టే విధించింది. ప్రభుత్వం చట్టబద్ధమైన మార్గ దర్శకాలు రూపొందించేవరకూ ఈ స్టే కొనసాగుతుందని బెంచ్ స్పష్టం చేసింది. ఈ-ఫార్మా సంస్థలు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎం.సత్యనారాయణన్‌, జస్టిస్‌ పి.రాజమాణిక్యంతో కూడిన బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది. అన్‌లైన్‌లో ఔషధాలను అమ్మే విధానాన్ని నిషేధించాలని గత నెలలో ఏక సభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది.  ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాల నిషేధం 30 నుంచి 40 లక్షల రోగులపై ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీంతో రానున్న రెండు నెలల్లోనే పరిశ్రమ రూ.300 కోట్లు నష్టపోతారని పేర్కొన్నారు. 

ఆన్‌లైన్‌లో మెడిసిన్ అమ్మకాలను నిషేధించాలని కోరుతూ గతంలో ఓ వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. డ్రగ్స్‌, కాస్మొటిక్స్‌ చట్టం-1940, ఫార్మసీ చట్టం-1948 ప్రకారం మెడిసిన్ ఆన్‌లైన్‌ వేదికల్లో అమ్మేందుకు అనుమతి లేదని పిల్‌లో పేర్కొన్నారు. పొరపాటున మెడిసిన్ మారితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇదే జరిగితే రోగులతో పాటు వైద్యులకు సైతం ప్రమాదం పొంచి ఉంటుందని వివరించా.