మహానాయకుడు ఎండింగ్ ఇలాగే ఉంటుంది..!!

మహానాయకుడు ఎండింగ్ ఇలాగే ఉంటుంది..!!

ఎన్టీఆర్ బయోపిక్ లో రెండు సినిమాలు వచ్చాయి.  ఒకటి ఎన్టీఆర్ కథానాయకుడు కాగా, రెండో సినిమా ఎన్టీఆర్ మహానాయకుడు.  కథానాయకుడు జనవరి 9 వ తేదీన రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ నట జీవితం గురించి.. సినిమా అవకాశాల గురించి.. సినిమా జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందనే విషయాల గురించి ఈ సినిమాలో చూపించారు.  

ఎన్టీఆర్ బయోపిక్ సీరీస్ లో రెండో సినిమా మహానాయకుడు వస్తోంది.  ఫిబ్రవరి 22 వ తేదీన భారీగా రిలీజ్ కాబోతున్నది.  ఎన్టీఆర్ సినిమా విషయాల గురించి అందరికి తెలిసినవే.  రాజకీయాలనేసరికి అందరికి ఆసక్తి ఏర్పడుతుంది.  రాజకీయాల గురించి ఏం చూపించబోతున్నారు.  ఎలా చూపించబోతున్నారన్నది ఆసక్తికరం.  ఈ బయోపిక్ అంతా కూడా బసవతారకం కోణంలో ఉంటుంది.  కథానాయకుడు ఓపెనింగ్ లో బసవతారకం గతాన్ని గుర్తు చేసుకుంటూ సినిమా మొదలౌతుంది. ఆ కోణంలోనే రెండో పార్ట్ మహానాయకుడు కూడా ఉంటుంది.  బసవతారకం మరణంతో మహానాయకుడు స్టోరీకూడా ఎండ్ అవుతుంది.  ఆ తరువాత జరిగిన విషయాలు ఏవి ఈ సినిమాలో ఉండవన్నమాట.