రాజ్‌కోట్‌ లో రెండో టీ-20...వరుణగండం ?

రాజ్‌కోట్‌ లో రెండో టీ-20...వరుణగండం ?

భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టీట్వంటీ మ్యాచ్ ఈరోజు రాజ్ కోట్ లో జరుగనంది. ఇప్పటికే ఢిల్లీ మ్యాచ్ లో విజయం సాధించిన బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ గెలవాలని ఆశ పడుతోంది.  ఈ మ్యాచ్ లోనూ పైచేయి సాధిస్తే బంగ్లా రికార్డులకెక్కుతుంది. రెండో టీ20లో విజయం సాధిస్తే భారత్‌ను సొంతగడ్డపై ద్వైపాక్షిక సిరీస్ లో ఓడించిన తొలి జట్టు అవుతుంది. ఇక హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ తన కెరీర్‌లో 100వ టీట్వంటీ ఆడనున్నారు. అయితే ఈరోజు జరగనున్న రెండో టీ20పై నీలినీడలు కమ్ముకున్నాయి. గుజరాత్ లోని డయు, పోర్ బందర్ మధ్య మహా తుపాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మహా తుపాను తీరం దాటే ముందు రాజ్ కోట్ సహా చూట్టు ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో మ్యాచ్ కు వాన గండం పొంచి ఉంది.