అది ఓ 'అపవిత్ర కూటమి': మోడీ

అది ఓ 'అపవిత్ర కూటమి': మోడీ

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడుతున్న 'మహాకూటమి'పై ప్రధాని మోడీ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. అది ఓ 'అపవిత్ర కూటమి'గా అభివర్ణించారు. మదురై, తిరుచిరాపల్లి, తిరువళ్లూరు, చెన్నై తూర్పు, ఉత్తర ప్రాంతాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ... వ్యక్తిగత ప్రయోజనాల పరిరకక్షణ కోసం కొందరు నేతలు 'మహాకూటమి'గా ఏర్పడుతున్నారని, ఇలాంటి అవకాశవాదుల ప్రయత్నాలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారని, అలాంటి సమన్వయం లేని కూటమిని ప్రజలు ఎప్పుడూ అంగీకరించరని అన్నారు. ఇది ఓ సిద్ధాంతం ప్రకారం ఏర్పాటవుతున్న కూటమి కాదు. అధికారం కోసమే దాన్ని ఏర్పాటు చేస్తున్నారు.. ప్రజల కోసం కాదు. కాంగ్రెస్‌ ప్రజల్లో అసత్యాలు ప్రచారం చేస్తోంది. ఓ వైపు దేశాభివృద్ధి కోసం ప్రయత్నాలు జరుగుతుంటే, మరోవైపు ప్రజలను తప్పుదోవ పట్టించే విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏ అవకాశాన్నీ వదలడం లేదు అని విమర్శించారు.