అమెరికా ప్రీమియ‌ర్ల నుంచి 2కోట్లు!

అమెరికా ప్రీమియ‌ర్ల నుంచి 2కోట్లు!

కీర్తి సురేష్ టైటిల్ పాత్ర‌లో నాగ్ అశ్విన్‌- అశ్వ‌నిద‌త్ కాంబో తెర‌కెక్కించిన `మ‌హాన‌టి` తెలుగు రాష్ట్రాలు స‌హా, ఓవ‌ర్సీస్‌లో చ‌క్క‌ని వ‌సూళ్లు సాధిస్తోంది. సావిత్రి బ‌యోపిక్ అన్న ప్ర‌చారంతో ఈ సినిమాకి ఓపెనింగులు బాగానే ద‌క్కాయ‌ని తెలుస్తోంది. ఓవ‌ర్సీస్ ప్రీమియ‌ర్ల రిపోర్ట్ ఇప్ప‌టికే అందింది. 

డే1 బాక్సాఫీస్ వ‌ద్ద‌ `మ‌హాన‌టి` బిగ్ స‌క్సెస్ సాధించింద‌ని దీనిని బ‌ట్టి చెప్పొచ్చు. ఇప్ప‌టికైతే మీడియాలో మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చినా ఒక నిజ‌జీవిత‌క‌థ‌ను క‌లుషితం చేయ‌కుండా య‌థాత‌థంగా తీశార‌న్న మంచి పేరు వ‌చ్చింది. అమెరికా లాంటి చోట ఎన్నారైలు ఈ చిత్రాన్ని క్రేజీగా వీక్షిస్తున్నారు. అక్క‌డ దాదాపు 150 లొకేష‌న్ల‌లో ఈ సినిమా రిలీజైతే ప్రీమియ‌ర్ల రూపంలో ఏకంగా 303కె డాల‌ర్లు వ‌సూలైంది. ఈ మొత్తం 2కోట్ల‌కు స‌మానం. ఇక తొలి వీకెండ్ ఈ సినిమా వ‌సూళ్ల‌లో అద‌ర‌గొడుతుంద‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఓవ‌ర్సీస్ ప్రీమియ‌ర్లలో అజ్ఞాత‌వాసి, భ‌ర‌త్ అనే నేను, రంగ‌స్థ‌లం చిత్రాలు టాప్ 3 ప్రీమియ‌ర్ల‌తో చ‌క్క‌ని ఓపెనింగులు సాధించాయి. ఆ త‌ర‌వాతి స్థానం `మ‌హాన‌టి`కే ద‌క్కింద‌ని ట్రేడ్ చెబుతోంది.