మహానటి 16 రోజుల కలెక్షన్స్ 

మహానటి 16 రోజుల కలెక్షన్స్ 

అలనాటి నటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మహానటి'. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ బయోపిక్ కు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన నాటి నుండే మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటన, నాగ్ అశ్విన్ కథను నడిపిన విధానం, జెమిని గణేశన్ పాత్రలో డుల్కర్ సల్మాన్ నటించిన తీరు అన్ని ప్రేక్షకులను పడేశాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం 33 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పటి వరకు ఏరియాల వారీగా ఏ మేరకు కలెక్షన్స్ ను సాధించిందో చూసేద్దామా. 

నైజాం - 9.15 కోట్లు 
UA - 2.85 కోట్లు 
సీడెడ్ - 1.95 కోట్లు 
గుంటూరు - 1.59 కోట్లు 
కృష్ణ - 1.85 కోట్లు 
ఈస్ట్ - 1.62 కోట్లు 
వెస్ట్ - 1.15 కోట్లు 
నెల్లూరు - 0.57 కోట్లు 
మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల వసూళ్లు : 20.73 కోట్లు 
ROI - 2.80 కోట్లు 
ఓవర్సీస్ - 9.70 కోట్లు 
ప్రపంచ వ్యాప్తంగా సాధించిన వసూళ్లు : 33.23 కోట్లు