మహానటి నైజాం కలెక్షన్స్ 

మహానటి నైజాం కలెక్షన్స్ 

అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "మహానటి". గత వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..నైజాం ఏరియాలో దాదాపు 2.6 కోట్ల కలెక్షన్స్ ను సంపాదించిందని తెలుస్తోంది. ఈ మధ్యలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం, సినిమాపై మంచి టాక్ వస్తున్న నేపథ్యంలో తెలుగునాట ఫుల్ రన్ లో 10 కోట్ల మేర కలెక్షన్స్ సాదిస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అటు ఓవర్సీస్ మార్కెట్ లో 1.3 మిలియన్ రికార్డు కలెక్షన్స్ ను సాధించింది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని స్వప్న దత్, ప్రియాంక దత్ లు నిర్మించారు.