కోలీవుడ్‌లో `మ‌హాన‌టి` ఉత్కంఠ?

కోలీవుడ్‌లో `మ‌హాన‌టి` ఉత్కంఠ?
`మ‌హానటి` సావిత్రి జీవితంలోని అస‌లు స‌స్పెన్స్ వీడేదెప్పుడు? ప‌్ర‌స్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్ స‌హా వ‌ర‌ల్డ్‌వైడ్ సాగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇది. లెజెండ్‌ సావిత్రి జీవితంలో ఉన్న‌న్ని చీక‌టి కోణాలు వేరొక న‌టి జీవితంలో ఉండ‌బోవ‌ని అభిమానులు చెబుతుంటారు. ప్ర‌పంచంలోనే అసాధార‌ణ ప్ర‌తిభావ‌నిగా, గొప్ప న‌టిగా వెలిగిపోయిన సావిత్రి చివ‌రి జీవితంలో తాగుడుకు బానిస‌వ్వ‌డం, భ‌ర్త‌నుంచి ప‌రాభ‌వానికి గుర‌వ్వ‌డం వంటి ఎపిసోడ్లు ఎంతో ఉద్విగ్నంగా ఉంటాయ‌ని చెబుతారు. ప్ర‌మాద‌క‌ర‌ క్ష‌య వ్యాధి ఓ వైపు బాధిస్తుంటే, అయిన‌వాళ్ల నిరాద‌ర‌ణ‌కు గురై సావిత్రి మ‌ర‌ణానికి గుర‌వ్వ‌డం అన్న‌ది అభిమానుల్ని తీర‌ని వేద‌న‌కు, క‌ల‌త‌కు గురి చేసింది నాడు. సావిత్రి చివ‌రి రోజుల్లో ఫోటోలు ఇప్ప‌టికీ వెబ్‌లో వైర‌ల్ అవుతున్నాయంటే, ఆ ఫోటోల్లోనే త‌న జీవితం క‌నిపిస్తోంద‌న్న‌ది అభిమానులు చెప్పే మాట‌. అయితే ఈ విష‌యాల‌న్నీ తెర‌పై చూపిస్తున్నారా? సావిత్రి జీవితంలో అత్యంత కీల‌క‌మైన జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌ను ఏ కోణంలో చూపించ‌బోతున్నారు? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఓ ర‌కంగా సావిత్రి బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నారు అన‌గానే, తెలుగు జ‌నం కంటే త‌మిళ తంబీలే ఎక్కువ‌గా మాట్లాడుకున్నారు. ఇంకా చెప్పాలంటే త‌మిళ‌నాట జెమినీ గ‌ణేషన్ వ‌ర‌ల్డ్‌వైడ్ ఫ్యాన్స్‌లో ఒక‌టే ఉత్కంట నెల‌కొంది. రేప‌టి ఉద‌యం మ‌హాన‌టి టీజ‌ర్ ను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా వైజ‌యంతి మూవీస్ సంస్థ రిలీజ్ చేయ‌నుంది. ఈ టీజ‌ర్‌లో కీర్తి గ్లింప్స్ మైమ‌రిపిస్తాయని తెలుస్తోంది. స‌మంత‌, దుల్కార్ (జెమిని గ‌ణేష‌న్‌) పాత్ర‌ల్లో గ్లింప్స్ ఈ టీజర్‌లో ఉంటాయ‌నే అంచ‌నా వేస్తున్నారు. ముఖ్యంగా మ‌న‌కంటే కోలీవుడ్‌లో న‌డిగ‌య్యార్ తిల‌గ‌మ్ సావిత్రి జీవిత‌క‌థ‌ను తెర‌పై చూడాల‌న్న ఉత్కంఠ ఎంతో ఉంద‌న్న‌ది గ్రౌండ్ రిపోర్ట్‌. మే 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.