మహానటి మెప్పించింది..

మహానటి మెప్పించింది..

మహానటి సినిమా బుధవారం రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ పూర్తయింది.  సావిత్రి జీవిత కథకు అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది.  మహానటిగా కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉందని అభిమానులు చెప్తున్నారు.  ఇక క్లైమాక్స్ లో మధురవాణిగా కనిపించిన సమంత కన్నీరు పెట్టించింది.  సమంత ఎందుకు ఏరికోరి మరి ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నదో సినిమా చూస్తే అర్ధం అవుతుంది.  

జెమిని గణేశన్ గా దుల్కర్ సల్మాన్, విజయ్ ఆంటోనిగా విజయ్ దేవరకొండ, ఎస్వీఆర్ గా మోహన్ బాబు, నాగేశ్వర రావుగా నాగచైతన్య ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయి నటించారట.  ఎన్టీఆర్ రోల్ ను డిజిటల్ చిత్రీకరించారు.  బొర్రా సాయిమాధవ్ మాటలు ఆద్యతం రక్తి కట్టించాయి.  డేనియల్ కెమెరా కన్ను తిప్పుకొనివ్వదు.  నాన్ కమర్షియల్ ఫార్మాట్ లో తీసిన ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది.  నాగ్ అశ్విన్ చేసిన సావిత్రి బయోపిక్ ప్రయోగం సక్సెస్ అయిందని చెప్పొచ్చు.  ట్విట్టర్ లో ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ వస్తున్నది.