షాంగై ఫెస్టివల్ కు మహానటి

షాంగై ఫెస్టివల్ కు మహానటి

మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా టాలీవుడ్ లో తెరకెక్కిన సినిమా మహానటి.  నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.  ఈ సినిమాలో సావిత్రిగా నటించిన కీర్తి సురేష్ కు మంచి పేరు వచ్చింది.  నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది.  

షాంగైలో జరుగుతున్న షాంగై ఫిలిం ఫెస్టివల్ కు ఈ సినిమా ఎంపికైంది. దుర్క్యూర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత లతో పాటు దక్షిణాది భాషలకు చెందిన అనేకమంది నటీనటులు ఈ సినిమాలో నటించారు.  వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించింది.