డ్రైనేజ్ శుభ్రం చేస్తూ ముగ్గురు మృతి

డ్రైనేజ్ శుభ్రం చేస్తూ ముగ్గురు మృతి

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. డ్రైనేజీ శుభ్రం చేస్తూ ముగ్గురు కూలీలు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన పశ్చిమ థానేలోని ధోకాలిలోని ప్రైడ్‌ ప్రెసిడెన్సీ లక్సేరియా నివాస సముదాయంలో చోటు చేసుకుంది. మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని శుభ్రం చేసేందుకు శుక్రవారం ఎనిమిది మంది కూలీలు ప్లాంట్‌లోకి వెళ్లారు. అయితే ఊపిరాడకపోవడంతో కూలీలు అందులో చిక్కుకుపోయారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు వెంటనే రెస్యూ సిబ్బందిని రంగంలోకి దింపారు. అయితే అప్పటికే ముగ్గురు కూలీలు మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 130 క్యూబిక్ మీటర్ల లోతు ఉన్న ఈ ప్లాంట్‌లో విషవాయువుల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను అమిత్ ఫుహల్, అమన్ బాదల్, అజయ్ బంబుక్ గా గుర్తించారు.