మహారాష్ట్ర, హర్యానాలో 21న పోలింగ్..

మహారాష్ట్ర, హర్యానాలో 21న పోలింగ్..

తెలంగాణలోని హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంతో పాటు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో మొత్తం 3,239 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ 90,403 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇక హర్యానా విషయానికొస్తే 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల బరిలో 1,168 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఓటర్ల కోసం ఎన్నికల కమిషన్ 19,425 పోలింగ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేసింది. కోటి 82 లక్షల 98వేల 714 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహారాష్ట్ర, హర్యానాలోని పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. 21వ తేదీన ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈనెల 24న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశముంది.