మూడు రూపాయలకే మూడు లేయర్ల మాస్క్...!!

మూడు రూపాయలకే మూడు లేయర్ల మాస్క్...!!

కరోనా  సమయంలో మాస్క్ లకు మంచి డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే.  కరోనా మహమ్మారిని అడ్డుకోవాలి అంటే మాస్క్ పెట్టుకోవడం ఒక్కటే మార్గం అని నివేదికలు చెప్తున్నాయి.  మాస్కులు లేకుండా బయటకు రావొద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నారు.  అయితే, కరోనా కాలంలో దేశంలో మాస్కుల తయారీ ఊపందుకుంది.  మూడు లాయర్ల మాస్కులను ఎక్కువగా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు.  మూడు లేయర్ల మాస్కులు ఎక్కువ ఖరీదు ఉంటాయి.  కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం, మాస్కుల ధరలను ప్రకటించింది.  మూడు లేయర్ల మాస్కులను రూ.3 నుంచి రూ.4 లకి మాత్రమే అమ్మాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ఇక నాణ్యమైన ఇన్ 95 మాస్కులు రూ.19 నుంచి రూ.49 మధ్యలోనే విక్రయించాలని మహా ప్రభుత్వం పేర్కొన్నది.  మాస్కులను అందరూ ధరించాలంటే తక్కువ ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు అమ్మకాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించింది.  రాష్ట్రంలో అంటువ్యాధుల నిబంధనలు అమలులో ఉన్నంతకాలం ప్రతిఒక్కరు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని డిమాండ్ చేశారు.