మహారాష్ట్ర మాజీ సీఎల్పీ నేతకు మంత్రి పదవి

మహారాష్ట్ర మాజీ సీఎల్పీ నేతకు మంత్రి పదవి

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. మొత్తం 13 మంది మంత్రులకు ఫడ్నవిస్‌ అవకాశం కల్పించగా.. వారిలో 10 మంది బీజేపీ ఇద్దరు శివసేన ఒకరు ఆర్‌పీఐ నుంచి ప్రాతినిథ్యం పొందారు. పదిమంది బీజేపీ మంత్రుల్లో ఆరుగురికి కేబినెట్ హోదా, నలుగురికి సహాయ మంత్రుల హోదా ఇచ్చారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో కొత్త మంత్రులందరి చేత గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీనేత విఖే రాధాకృష్ణ పాటిల్ కు మంత్రి వర్గంలో చోటు దక్కింది. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించిన ఆయన ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఆయన్ను తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఫడ్నవిస్ తన కేబినెట్‌ను విస్తరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.