'కాళేశ్వరం' మోడీ, మహారాష్ట్ర గిఫ్ట్..!

'కాళేశ్వరం' మోడీ, మహారాష్ట్ర గిఫ్ట్..!

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్‌ అని అన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్... గవర్నర్ నరసింహన్, తెలంగాణ, ఆంధ్ర సీఎంలతో కలిసి మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన... అనంతరం కాళేశ్వరం వెళ్లారు... కాళేశ్వరం ఆలయ ప్రధాన గోపురం వద్ద ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు అర్చకులు. ఇక, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సీఎం ఫడ్నవీస్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రం మారిపోనుందన్నారు. ఈ ప్రాజెక్ట్ తో మహారాష్ట్రకు కూడా నీళ్లు వస్తాయన్న ఫడ్నవీస్... దీంతో మేం నష్టపోయేది ఏమీ లేదన్నారు.