సచిన్, కోహ్లీ సెంచరీలు చూశాం.. ఇప్పుడు నీ సెంచరీ చూస్తున్నాం..!

సచిన్, కోహ్లీ సెంచరీలు చూశాం.. ఇప్పుడు నీ సెంచరీ చూస్తున్నాం..!

ఎప్పుడూ లేని విధంగా పెట్రో ఛార్జీలు పెరుగుతూ పోతున్నాయి... లీటర్ పెట్రోల్‌ ధర దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే సెంచరీ దాటేయగా.. డీజిల్‌ ధర కూడా తానేం తక్కువ అనే రేంజ్‌లో పెరుగుతూనే ఉంది. ఇక, చమురు ధరలు పెరుగుతుండడంతో.. క్రమంగా కూరగాయాలు, నిత్యావసరాలు.. ఇలా అన్నింటిపై ప్రభావం పడుతోంది. అంతేకాదు.. ఇప్పట్లో చమురు ధరలు తగ్గే అవకాశం లేదంటూ సంకేతాలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం.. అయితే, చమురు ధరల పెరుగుదలపై సెటైర్లు వేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. మధ్యలో సచిన్ టెండూల్కర్, విరాట్‌ కోహ్లీని లాగారు.. అంటే.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంపై స్పందిస్తూ.. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ-సచిన్ టెండూల్కర్ సెంచరీలు చూశాం.. కానీ, ఇప్పుడు మనం పెట్రోల్-డీజిల్ సెంచరీలు చూస్తున్నామని ఎద్దేవా చేశారు.