మహారాష్ట్రలో కాంగ్రెస్ కు షాక్

మహారాష్ట్రలో కాంగ్రెస్ కు షాక్

మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రాధాకృష్ణ విఖే పాటిల్ రాజీనామా చేశారు. పార్టీలో ఉండడం కుదరదని స్పష్టం చేశారు. ఆయన త్వరలోనే బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మరో పది మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి 48 స్థానాలకు గాను 41 గెలుచుకోగా, ఎన్‌సీపీ నాలుగు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైంది.