ఆ ఆరు జిల్లాలో నో డీజిల్‌

ఆ ఆరు జిల్లాలో నో డీజిల్‌

మహారాష్ట్రలోని ఆరు జిల్లాల్లో డీజిల్‌ అమ్మకాలను క్రమంగా నిలిపివేయనున్నారు. రానున్న అయిదేళ్ళలో మహారాష్ట్రలోని గోందియా, చంద్రాపూర్‌, గడ్చిరోలి, నాగ్‌పూర్‌, భందారా, వార్దా జిల్లాలో డీజిల్‌ అమ్మకాలను నిలుపుదల చేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ జిల్లాలో ఒక్క చుక్క డీజిల్‌ కూడా దొరకనీయకుండా చూస్తామని ఆయన అన్నారు. ప్రస్తుతం బయో సీఎన్‌జీ ఇంధనం ద్వారా 50 బస్సులు నడుస్తున్నాయని... ఈ ఇంధనం తయారీ కోసం ఆరు ఫ్యాక్టరీలను నెలకొల్పుతున్నామని... ట్రక్కులకు కూడా బయో సీఎన్‌జీ సరఫరా చేస్తామని గడ్కరీ అన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రైవేట్‌ రంగం మరింత చురుగ్గా పాలు పంచుకునేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. సాధ్యమైనంత ఎక్కువ జిల్లాల్లో డీజిల్‌ బదులు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.