మహర్షి సీడెడ్ రైట్స్ ఎంతో తెలుసా..?

మహర్షి సీడెడ్ రైట్స్ ఎంతో తెలుసా..?

మహర్షి సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈనెల 15 వ తేదీ నుంచి మిగతా షూటింగ్ వర్క్స్ ను కంప్లీట్ చేయనున్నారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ నడుస్తున్నాయి.  ఇందులో భాగంగా మహేష్ బాబు డబ్బింగ్ కూడా చెప్తున్నారు.  మే 9 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  

రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.  టీజర్ ఆకట్టుకోవడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ అమాంతం పెరిగిపోయింది.  ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మహర్షి బిజినెస్ చాలా వరకు పూర్తయింది.  సీడెడ్ లో ఈ సినిమా రూ.12.6 కోట్లకు అమ్ముడు పోయింది.  ఈ స్థాయిలో బిజినెస్ జరగడానికి టీజరే కారణం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.  పూజా హెగ్డే, అల్లరి నరేష్ లు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.