'మహర్షి' డబ్బింగ్ మొదలైంది !
మహేష్ బాబు, వంశీ పైడిపల్లిల 'మహర్షి' చిత్రం శరవేగంగా పనులు జరుపుకుంటోంది. షూటింగ్ ఆఖరి దశకు చేరుకోవడంతో చిత్ర యూనిట్ డబ్బింగ్ పనులకు సన్నద్ధమైంది. ఈరోజే పూజా కార్యక్రమాలతో పనులు మొదలయ్యాయి. త్వరలో మహేష్ బాబు కూడా డబ్బింగ్ పనుల్లో పాల్గొననున్నాడు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదలకానుంది. దిల్ రాజు, అశ్విని దత్, పివిపిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)