'మహర్షి' ఫైనల్ షెడ్యూల్ జరగబోయేది అక్కడే !

'మహర్షి' ఫైనల్ షెడ్యూల్ జరగబోయేది అక్కడే !

 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'మహర్షి' చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  ప్రస్తుతం పొల్లాచ్చిలో షూటింగ్ జరుగుతోంది.  తరవాతి షెడ్యూల్ ఫిబ్రవరి నెలలో హైదరాబాద్లో జరగనుంది.  ఇక ఆఖరి షెడ్యూల్ ను అబుదాబిలో జరగనుంది.  దీంతో చిత్రం పూర్తవవుతుంది.  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది.  మహేష్ గత చిత్రం 'స్పైడర్' పరాజయం చెందడంతో ఈ సినిమాపై బోలెడు ఆశలుపెట్టుకున్నారు అభిమానులు.  ఇకపోతే చిత్ర టీజర్ మార్చి 4న రిలీజయ్యే అవకాశాలున్నాయి.