మహర్షి విజయోత్సవ సభ ఫిక్స్

మహర్షి విజయోత్సవ సభ ఫిక్స్

మహర్షి విజయం తరువాత హైదరాబాద్ లోని మహేష్ అండ్ కో టీమ్ ప్రెస్ మీట్ ను, సక్సెస్ మీట్ లను నిర్వహించారు.  ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్లో మహేష్ అభిమానులతో తన అనుభవాలను పంచుకున్నాడు.  కాలర్ ఎగరేసి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు. విజయవాడలో విజయోత్సవ సభను నిర్వహించేందుకు మహర్షి టీమ్ ప్లాన్ చేసింది.  

మహర్షి విజయోత్సవ సభను విజయవాడలోని సిద్దార్ధ కాలేజీకి ఆవరణలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఈనెల 18 వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ సభ ఉంటుందని మహర్షి టీమ్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది.  మహేష్ తో పాటు నటించిన నటీనటులు అంతా ఈ సభలో పాల్గొనబోతున్నారు.