యూట్యూబ్ ను షేక్ చేస్తున్న మహర్షి మేకింగ్ వీడియో

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న మహర్షి మేకింగ్ వీడియో

మహర్షి సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  మహర్షి కెరీర్లో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా ఫ్యూచర్ లో మరిన్ని వసూళ్లు సాధించే చిత్రంగా నిలబడుతుంది అనడంలో సందేహం లేదు.  మహర్షి కి పర్ఫెక్ట్ ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిన ఈ చిత్రం ఇప్పటికే అనేక చోట్ల నాన్ బాహుబలి రికార్డులను సాధించింది.  ముఖ్యంగా నైజాంలో భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతున్నది. 

ఇదిలా ఉంటె, మహర్షి సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను యూనిట్ రిలీజ్ చేసింది.  దిల్ రాజు యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు అందరిని దృష్టిని ఆకర్షించింది.  పల్లెటూరి సెట్ నిర్మాణం, అమెరికాలో షూటింగ్ విధానం వంటి విషయాలను ఈ మేకింగ్ వీడియోలో చూపించడం విశేషం.